ADB: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై డీఎస్పీ జీవన్ రెడ్డి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాల పరిశీలన, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించారు.