నారాయణపేట పురపాలక సంఘంలో తై బజార్, మాంస వ్యర్థాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో బండి గణేష్ రూ.13,61,900కు తై బజార్ హక్కులు పొందారు. మాంస వ్యర్థాల సేకరణ హక్కులను ప్రసాద్ రూ.10,60,000కు సొంతం చేసుకున్నారు. ఈ వేలం ద్వారా మున్సిపాలిటీకి మంచి ఆదాయం లభించింది.