WNP: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్. సునీత అన్నారు. లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకొని తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. క్రిమినల్, కుటుంబ, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాల కేసులను రాజీతో పరిష్కరించుకోవచ్చన్నారు.