ADB: ప్రతి ఒక్కరూ పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలక్ మందిర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత పొగాకు ఉత్పత్తులకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని తెలిపారు.