NLG: నందికొండ మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్ హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ అశోక్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరి సహకారంతో నందికొండ పురపాలక సంఘం అభివృద్ధికి పాటుపడతానన్నారు.