NLG: పరిశుభ్రతతోనే టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలను నివారించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో టైఫాయిడ్ జ్వరాలపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు.