HYD: రంజాన్ మాసం సందర్భంగా చౌమహల్లా ప్యాలెస్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు (దువా) నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.