మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకిని నూతనంగా ఎన్నికైన మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గురువారం కలిశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగరం అభివృద్ధిలో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించేలా తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.