BDK: బీసీల హక్కులను రక్షించేందుకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కేటాయిస్తూ చట్టం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొదమూరు సత్యనారాయణ ప్రభుత్వాన్ని బుధవారం డిమాండ్ చేశారు. బీసీలు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్ అమల దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.