JGL: నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పెన్షనర్లను నిరాశ పరిచిందని, తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024 నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిలు రూ.12 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.