SRPT: జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో 21 పంచాయతీలను టీబీ ముక్తి జీపీలుగా గుర్తించామన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.