SDPT: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న జాబ్ మేళా జరగనుంది. డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థుల కోసం ఈ మేళాను నిర్వహిస్తున్నారు. టాటా ఎలాక్ట్రానిక్స్, జెన్సిస్ ఇన్ఫో, కల్పాటెక్ సొల్యూషన్స్ వంటి కంపెనీల ప్రతినిధులు హాజరై ఎంపిక ప్రక్రియ చేపడతారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్ కుమార్ తెలిపారు.