NZB: కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత తీవ్ర ఆటంకంగా మారిందని మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. గ్రామస్తులకు చెందిన సొంతట్రాక్టర్లకు అనుమతినిరాకరిస్తున్నారని, దీనివల్ల నిర్మాణాలు నిలిచిపోయాయని వినతిపత్రంలో వివరించారు.