NLG: హైదరాబాద్, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంస్కృత భాష అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గంటెపాక శ్రీను (చిట్యాల వాసి) సర్వేపల్లి రాధాకృష్ణ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈనెల 31న గుంటూరులో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు సంస్థ ఫౌండర్ వై నాగయ్య, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ రావులు ఉత్తర్వులు జారీ చేశారు.