SRPT: మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలను గురువారం మండల అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.