MLG: కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నూరి నర్సింగరావు (28) ఉరివేసుకొని అపస్మారక స్థితిలోకి చేరాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.