HYD: జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల భయం వెంటాడుతుంటే ఇటు కొండాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు కలుస్తోందన్న ఫిర్యాదులు వస్తున్నాయి.