KMM: మధిర సర్కిల్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వంగాల నాగేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. ఈ సందర్భంగా మంగళవారం మధిర రూరల్ సీఐ మధు ఆయన్ని అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడంతో మధిర విధుల నుంచి ఆయన రిలీవయ్యారు. కొత్త విధులకు త్వరలో రిపోర్టు చేయనున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.