MHBD: హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో బుధవారం సాయంత్రం 4వ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బతుకమ్మ వేడుకలో మాజీమంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ మాజీ ఎంపి మాలోత్ కవిత, BRS మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బతుకమ్మలు ఆడి సందడి చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.