KNR: కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం చాలా ముఖ్య మైనదని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపానెల్డ్ న్యాయవాదులకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను అతి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పరిష్కరించవచ్చని అన్నారు.