ఆసిఫాబాద్ జిల్లాలో దివ్యాంగుల కోసం మార్చి నెలలో సదరం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెల్లడించింది. మార్చి 11న కంటి చూపు, 12న మానసిక వైకల్యం, 18న రక్తస్రావ రుగ్మతలు , 25న మూగ/చెవిటి, 27న ఎముకల వైకల్యాలపై పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని శిబిరాలు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతాయని పేర్కొన్నారు.