HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈనెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ తన ఛాంబర్లో ఆయనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.