SRPT: వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసుల అనుమతి లేకుండా డీజే వినియోగించిన నిర్వాహకులపై కేసు నమోదైంది. మోతే మండలం రావిపహాడ్‌లో పోలీసుల అనుమతి లేకుండా వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే వినియోగించారు. దీంతో వేడుకల నిర్వాహకుడు కార్తీక్, ఆర్గనైజర్ మహేష్‌పై కేసు నమోదు చేసి డీజే, వాహనం సీజ్ చేసినట్లు ఎస్సై అజయ్ గురువారం రాత్రి తెలిపారు.