KMM: కారేపల్లి మండలం లింగం బంజారా గ్రామంలో బుధవారం శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన దంపతులు పాల్గొని ఆలయ ప్రతిష్టకు సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పలువురు అధికారపార్టీకి చెందిన మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు జరిపారు.