MNCL: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది విధుల్లో సమర్థవంతంగా వ్యవహరించాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతిలాల్ సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్లో స్టేజ్ 1, 2 ఆర్వోలు, ఏఆర్వోలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఎన్నికల ప్రక్రియపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.