GDWL: బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు శనివారం గద్వాలలోని తన ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రంగులు మార్చినంత మాత్రాన అవి ఇందిరమ్మ ఇళ్లు కావని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిన ఈ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రారంభిస్తోందని ఆరోపించారు. ఈ పని సిగ్గుచేటని పేర్కొన్నారు.