NZB: నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (దుబ్బ)లో ఈ నెల 26న 69వ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాలబాలికల ఎంపికలు నిర్వహించనున్నామని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షలు గణేశ్ తెలిపారు. ఎంపికల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన వారు కామారెడ్డిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.