KNR: రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. ఉదయం 5 గంటలకు అంబేడ్కర్ స్టేడియంలో 5కె రన్ మారథాన్ ప్రారంభిస్తారు. 10 గంటలకు చొప్పదండిలోని గంగాధరలో కరీంనగర్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ నూతన శాఖను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభిస్తారు.