NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బిక్కనూరు క్యాంపస్లో ఈ నెల 26న జాతీయ సైన్స్ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని ఆర్గనైజింగ్ సెక్రటరీ, జువాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీల మంగళవారం పేర్కొన్నారు. ఈ సదస్సుకు వైస్ ఛాన్స్లర్ సందీప్ కుమార్ సుల్తానీయ (ఐఏఎస్) ముఖ్య అతిథిగా, రిజిస్టర్ ఆచార్య యాదగిరి, హాజరవుతున్నారని తెలిపారు.