తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం అనేక ప్రాంతాల్లో 1,798 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేసి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినాారాయణ 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఘన విజయం సాధించారు. 2018లో మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరగా..ఇటివల బీఆర్ఎస్ నుంచి పోటీలో దిగి ఓటమి పాలయ్యారు. మరోవైపు ఇల్లందులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కను...
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 60కిపైగా స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఇక తర్వాత బీఆర్ఎస్ పార్టీ 40కిపైగా ప్రాంతాల్లో ముందంజలో ఉంది. ఇక ఆయా ప్రాంతాల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి.
దేశవ్యాప్తంగా ఇటివల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా..ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా గెలుపు అన్నట్లుగా ఆసక్తి ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో జరుగుతోంది. అయితే హైదరాబాద్‌లో ఈ లెక్కింపు 15 చోట్ల జరుగుతున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక ప్రజలు తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు.
నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అనంతరెడ్డి ఉద్దేశపూర్వకంగానే పోస్టల్ బ్యాలెట్ కవర్లున్న డబ్బాల సీలు తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది.
119 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
కేసీఆర్ ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని పేర్కొన్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్ రావాలని హైకమాండ్ స్పష్టం చేసింది. ఇప్పటికే డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి భారీగా నేతలు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రతను పెంచారు.
ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ చూడాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వరసగా మూడోసారి గెలిచి, అధికారం చేపట్టబోతున్నామని తనను కలిసిన నేతలకు స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 2018తో పోలిస్తే 3 శాతం పోలింగ్ తగ్గిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా, యాకత్ పుర నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ నమోదైందని వివరించారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి పనిచేస్తావా..? సిగ్గు లేదా అని ధ్వజమెత్తారు.
నాగార్జున సాగర్‌లో తమకు న్యాయంగా రావాల్సిన నీటిని విడుదల చేస్తున్నామని, తమ భూభాగంలోకి మాత్రమే పోలీసులు ప్రవేశించారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.