నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల పోలింగ్లో హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా జరిగింది. అయితే ఈ అంశంపై టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇతని కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుంది. 2018లో ఆ సర్వే చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ‘ఓటు రిగ్గింగ్’కు పాల్పడ్డారని బిఎస్‌పి అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇక్కడ మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో 119 స్థానాలకు జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 70.66 శాతం ఓటింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే వీటిలో బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఏ పార్టీ అధికారాన్ని చేపడుతుందనే విషయాన్ని ఆయా సర్వేలు వెల్లడించాయి. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఓ వ్యక్తి ఆవుపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన సంఘటన తెలంగాణలోని నిర్మల్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓటు వేసే ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గోపూజ చేశారు. అలాగే మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్‌కు పూజ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓ రోగి ఆక్సిజన్ సిలిండర్ వెంటేసుకొని మరి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తనకు ఓటు విలువ తెలుసు అని, అందుకే 1966 నుంచి కంటిన్యూగా ఓటు వేస్తున్నానని తెలిపారు.
తెలంగాణ ఎన్నికల పోలింగుకు ముందే సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్(nagarjuna sagar) వివాదం పేరుతో తెలంగాణ సెంటిమెంట్ కుట్ర పన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ ఎన్నికల సీఈఓను కోరారు.