»India Tv Cnx Survey Impact Congress To Take Power
India TV-CNX సర్వే ఇంపాక్ట్.. అధికారం చేపట్టనున్న కాంగ్రెస్..?
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుంది. 2018లో ఆ సర్వే చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది.
India TV-CNX survey impact.. Congress to take power..?
India TV-CNX Survey: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఫలితం తేలాల్సి ఉంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవనుంది. ఫలితాలకు సంబంధించి నిన్న సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దాదాపు మెజార్టీ పోల్స్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోందని చెప్పేశాయి. ఒకటి, రెండు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి.
గత ఎన్నికల్లో ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే (India TV-CNX Survey) నిజమైంది. లాస్ట్ టైమ్ 62 నుంచి 70 సీట్లు వస్తాయని తెలిపింది. చెప్పినట్టు నిజమైంది. బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లను గెలుచుకుంది. ఇప్పడు కూడా ఆ సంస్థ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతోందని పేర్కొంది. కాంగ్రెస్కు 63 నుంచి 79 సీట్లు గెలుస్తోందని తెలిపింది. అంటే ఆ సంస్థ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ మార్క్ దాటనుంది. ఇతరుల అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అధికార బీఆర్ఎస్ పార్టీ 31 నుంచి 47 సీట్లను మాత్రమే గెలవనుందని చెప్పింది. దీనిని బట్టి బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రతిపక్షానికే పరిమితం కానుంది. ఇందుకు రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నారు. బీజేపీ బలం పెరగనుంది. గత ఎన్నికల్లో ఒక సీటు ఉండగా.. ఇప్పుడు 2 నుంచి 4 సీట్లను గెలవనుంది. మజ్లిస్ పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల అంటే.. 5 నుంచి 7 సీట్లలో గెలుస్తోందని తెలిపింది.