Office of the MLA was besieged as the money was not given
MLA: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ క్రమ క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నాం 1 గంట వరకు 38.2 శాతం పోలింగ్ అవగా.. 3 గంటల వరకు అది 51 శాతానికి చేరింది. పోలింగ్ ముగిసే సమయానికి అది 65 నుంచి 70 శాతంగా ఉండనుంది. కొన్నిచోట్ల డబ్బులు ఇవ్వడం లేదని జనం ఆందోళనకు దిగుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కొందరు మహిళలు నిరసన చేపట్టారు. కొందరు మహిళలకు (womens) డబ్బులు ఇచ్చారని.. తమకు ఇవ్వడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని (mla camp office) ముట్టడించారు. పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు ఉన్నారు. వార్డు కౌన్సిలర్లు తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసనకు దిగారు.
ఓటు అనేది అత్యంత విలువ కలిగిన హక్కు.. దానిని అమ్మడం నేరం.. అమ్ముడు పోవడం కూడా క్రైమ్. డబ్బు తీసుకోకుండా.. ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేధావులు కోరుతున్నారు. అయినప్పటికీ కొందరిలో ఆ మార్పు రావడం లేదు.