Purandeswari And Ramakrishna Fire Telugu State CMS
Purandeswari And Ramakrishna: నాగార్జున సాగర్ డ్యామ్‌పై అర్ధరాత్రి ఏపీ పోలీసులు హల్ చల్ చేసిన అంశంపై ఏపీ నేతలు స్పందించారు. బీజేపీ, సీపీఐ పార్టీలు తప్పుపట్టాయి. ఇవి ముమ్మాటికీ రాజకీయ ప్రయోజనం కోసమేనని ఖండించాయి. పచ్చగా ఉన్న రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకేనని అంటున్నాయి.
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ నీటి ఆలోచన తేవడం ఓట్ల కోసమేనని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (Purandeswari) మండిపడ్డారు. ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఏపీలో కరువు మండలాల గురించి అధికారులు చెప్పిన పట్టించుకోలేదని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారని సెటైర్లు వేశారు.
సాగర్ ఇన్సిడెంట్ వెనక రాజకీయ లబ్ది ఉందని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) అన్నారు. పట్టిసీమలో నీళ్లు ఉన్నప్పటికీ ఇవ్వడానికి జగన్‌కు మనసు అంగీకరించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సెంటిమెంట్ ద్వారా లబ్ది పొందాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే సాగర్ వద్ద హైడ్రామా చేశారని ధ్వజమెత్తారు. సాగర్ వద్ద ఘర్షణ సీఎంలు కేసీఆర్, జగన్ వద్ద మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమేనని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సాగర్ ఇష్యూను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు.