»Ponnam Prabhakar Worshiped The Gas Cylinder And Voted The Video Went Viral
Telangana: గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేసి ఓటు వేసిన పొన్నం..వీడియో వైరల్
ఓటు వేసే ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గోపూజ చేశారు. అలాగే మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్‌కు పూజ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ (Telangana)లో ఎన్నికల పోలింగ్ (Elections Polling) ప్రక్రియ సాగుతోంది. ఈ తరుణంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తన నివాసంలో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder)కు పూజలు చేసి ఓటు వేశారు. సాధారణంగా చాలా మంది నాయకులు మంచి ముహూర్తం చూసుకునిమరీ నామినేషన్ వేస్తుంటారు. తాము గెలవాలనే ఉద్దేశంతో దేవాలయాలకు వెళ్లి మరీ ప్రార్ధనలు చేస్తారు. ఓటు వేసే ముందు కూడా శకునం చూసుకుని మరీ ఓటు వేసే నేతలు చాలా మంది ఉన్నారు.
గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేస్తున్న పొన్నం కుటుంబం:
గ్యాస్ సిలిండర్ కి పూజలు చేసిన పొన్నం ప్రభాకర్ గారు
అందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుభసూచకంగా ఓటు వేసేందుకు ముందు గోపూజ చేశారు. తన భార్యతో కలిసి గోపూజ చేసి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తన తల్లి కాళ్లకు నమస్కారం చేసిన తర్వాత వంట గ్యాస్ సిలిండర్‌కు పూల దండ వేసి రూ.500ల నోటుతో అలంకరించి పూజ చేశారు.
మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్‌కు ఓటు వేసిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఓటు వేయడం విశేషం. ఇకపోతే కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మహిళలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చర్యకు సింబాలిక్‌గా కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్‌కు మొక్కారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన గ్యాస్ సిలిండర్‌కు పూజ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.