Polling: తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ (Polling) ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నాం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ (Polling) నమోదైంది. అత్యధికంగా మెదక్లో 69 శాతం పోలింగ్ జరిగింది.
13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఆ సమయంలో క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావు పేట, భద్రాచాలం నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం నేపథ్యంలో గంట ముందు పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది.