Ibrahimpatnam unsealed postal ballot boxes congress leaders protest
ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పేపర్ బాక్సుల సీల్ ఓపెన్ చేసి ఉండటం పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లో ఇబ్రహింపట్నం సీవీఆర్ కాలేజీలో ఆదివారం చేపట్టే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏజెంట్ల పాసులు అందించారు. ఆ క్రమంలో పలువురు కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు శనివారం రాత్రి 8 గంటలకు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఉన్న గది తాళం తెరిచి ఉండటం గురించి ఆర్డోవోను ప్రశ్నించగా అతను సమాధానం చెప్పలేదు.
అంతేకాదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్న కొన్ని డబ్బాల సీల్ కూడా తెరిచి ఉందని కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు(congress leaders) నిరసనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మరికొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు, సీపీఎం నాయకులు కూడా ఆర్డీఓ(RDO) వద్దకు చేరుకుని నవంబర్ 29న వచ్చిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులపై ఆరా తీశారు. ఆర్డిఓపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆర్డీవో బిఆర్ఎస్ నాయకుల ప్రభావంతో పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేశారని ఆరోపించారు. మరోవైపు సీల్ తీసిఉన్న భాక్సులు ఖాలీగా ఉన్నవని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విచారణ జరిపిస్తామని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరీ అన్నారు.