CM KCR Busy In Election Campaign, Schedule Is Here
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కదన రంగంలో గులాబీ బాస్ కేసీఆర్ దిగబోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి హుస్నాబాద్ వేదికగా సమరశంఖం పూరిస్తారు. అప్పటి నుంచి నామినేషన్ వేసే తేదీ.. అంటే నవంబర్ 9వ తేదీ వరకు వరస బహిరంగ సభలతో బిజీగా ఉంటారు. ఆ షెడ్యూల్‌ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఓ సారి చుద్దాం.
అక్టోబర్ 15వతేదీన హుస్నాబాద్‌లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుంది.
16వ తేదీన రెండుచోట్ల బహిరంగ సభలు ఉంటాయి. జనగామలో మధ్యాహ్నాం 1 నుంచి 2 గంటల వరకు, భోన్గిరిలో మధ్యాహ్నాం 2 గంటల నుంచి 3 గంటల వరకు సభ ఉంటుంది.
17వ తేదీన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సిరిసిల్లలో మధ్యాహ్నాం 1 గంట నుంచి 2 గంటల వరకు, సిద్దిపేటలో మధ్యాహ్నాం 2 గంటల నుంచి 3 గంటల వరకు సభ ఉంటుంది.
18వ తేదీన కూడా రెండు చోట్ల సభలు ఉంటాయి. జడ్చర్లలో మధ్యాహ్నాం 1 గంట నుంచి 2 గంటల వరకు, మేడ్చల్‌లో 2 గంటల నుంచి 3 గంటల వరకు సభ ఉంటుంది. ఆ తర్వాత మహార్నవమి, బతుకమ్మ, దసరా నేపథ్యంలో బ్రేక్ ఉంటుంది.
26వ తేదీన మూడు చోట్ల సభలు ఉంటాయి. అచ్చంపేటలో మధ్యాహ్నాం 1 గంట నుంచి 2 గంటల వరకు, నాగర్ కర్నూల్లో 2 గంటల నుంచి 3 గంటల వరకు, మునుగోడులో 3 గంటల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలు ఉంటాయి.
27వ తేదీన పాలేరులో మధ్యాహ్నాం 1 గంట నుంచి 2 గంటల వరకు, స్టేషన్ ఘన్‌పూర్‌లో 2 గంటల నుంచి 3 గంటల వరకు సభలు ఉంటాయి.
29వ తేదీన 1 గంట నుంచి 2 గంటల వరకు కోదాడలో 2 నుంచి 3 గంటల వరకు తుంగతుర్తి, 3 నుంచి 4 గంటల వరకు అలేరులో బహిరంగ సభలు ఉంటాయి.
30వ తేదీన జుక్కల్‌లో 1 గంట నుంచి 2 గంటల వరకు, 2 నుంచి 3 వరకు బాన్స్ వాడ, 3 నుంచి 4 గంటల వరకు నారాయణ ఖేడ్‌లో సభలు ఉంటాయి.
31వ తేదీన హుజూర్ నగర్లో 1 నుంచి 2 గంటల వరకు, మిర్యాలగూడలో 2 నుంచి 3 గంటల వరకు, దేవరకొండలో 3 నుంచి 4 గంటల వరకు జరిగే సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
నవంబర్ 1వ తేదీన సత్తుపల్లి 1 గంట నుంచి 2 గంటల వరకు, ఇల్లందులో 2 నుంచి 3 గంటల వరకు సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
2వ తేదీన నిర్మల్‌లో 1 గంట నుంచి 2 గంటల వరకు, బాల్కొండలో 2 నుంచి 3 గంటల వరకు, ధర్మపురిలో 3 నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలు ఉంటాయి.
3వ తేదీనభైంసాలో 1 గంట నుంచి 2 గంటల వరకు, 2 నుంచి 3 వరకు ఆర్మూర్, 3 నుంచి 4 గంటల వరకు కోరుట్లలో బహిరంగ సభలు ఉంటాయి.
5వ తేదీన కొత్తగూడెంలో 1 నుంచి 2 వరకు, ఖమ్మంలో 2 నుంచి 3 గంటల వరకు సభ ఉంటుంది.
6వ తేదీన గద్వాలలో 1 నుంచి 2 గంటల వరకు, మక్తల్‌లో 2 నుంచి 3, నారాయణపేటలో 3 నుంచి 4 వరకు సభ ఉంటుంది.
7వ తేదీనచెన్నూరులో 1 నుంచి 2 వరకు, మంథనిలో 2 నుంచి 3 వరకు, పెద్దపల్లిలో 3 నుంచి 4 వరకు సభలు ఉంటాయి.
8వ తేదీన సిర్పూర్లో 1 నుంచి 2 గంటల వరకు, ఆసిఫాబాద్‌లో 2 నుంచి 3 వరకు, బెల్లంపల్లిలో 3 నుంచి 4 గంటల వరకు సభలు ఉంటాయి.
9వ తేదీనమధ్యాహ్నాం 1 నుంచి 2 గంటల వరకు గజ్వేల్‌లో నామినేషన్వేస్తారు.
2 నుంచి 3 గంటల వరకు కామారెడ్డిలో నామినేషన్ ఫైల్ చేస్తారు.
అక్కడ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.
చివరి క్షణంలో ఏ మార్పు లేకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభల షెడ్యూల్ ఇలా ఉండనుంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల జరగనుండా.. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల కమిషన్ చేపడుతుంది.