Telangana Assembly Elections 2023: Mynampally Hanumantha Rao Made Sensational Comments
Mynampally Hanumantha Rao: తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మంత్రి మల్లారెడ్డి కాదని.. కబ్జాల మల్లారెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. మల్లారెడ్డి అవినీతి పరుడని.. అతని కాలేజీలు అన్నీ చెరువులోనే ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి పదవీ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం పథకాలను బీఆర్ఎస్ తీసుకొచ్చిందని.. కమీషన్ల ద్వారా 30 శాతం వస్తోందని లెక్కలతో సహా వివరించారు.
రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ నుంచి గెలుస్తాడని.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని తెలిపారు. రోహిత్‌కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి పార్టీని వీడారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇటు బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక ఆనంద్‌ను ప్రభుత్వం పదవీ నుంచి తొలగించింది. హారిక భర్త ఆనంద్ హన్మంతరావు అనుచరుడిగా ఉన్నారు. అందుకోసమే నామినేటెడ్ పదవీని తొలగించారు.