Smart Watches Ban: రైళ్లు నడిపే లోకో పైలట్లు ఇక స్మార్ట్ వాచ్ (Smart Watch) ధరించొద్దు.. ఇటీవల ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ లోకో పైలట్ స్మార్ట్ వాచ్‌ను మొబైల్ మాదిరిగా ఉపయోగించాడు. ఆ ఫుటేజీ చూసి అధికారులు షాక్ అయ్యారు. సో.. లోకో పైలట్లు స్మార్ట్ వాచ్ (Smart Watch) వినియోగించడాన్ని బ్యాన్ చేశారు.
రైలు ప్రయాణించే సమయంలో ఇంజిన్ కేబిన్‌లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అవసరం అయితే మరొకరిని అనుమతిస్తారు. ఎవరి డ్యూటీ వారే చేస్తారు. క్యాబిన్లో మొబైల్ వాడొద్దు. సదరన్ జోన్లో లోకోమోటివ్ పైలట్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపిస్తారు. అలా మధురై డివిజన్లో ఒకరు స్మార్ట్ వాచ్ (Smart Watch) ఉపయోగించడాన్ని గుర్తించారు. స్మార్ట్ వాచ్ (Smart Watch) కొద్దిసేపు చూసినప్పటికీ.. వాచ్ స్క్రీన్ తరచు ఆన్ అయ్యింది.
ఆ ఫుటేజీ చూసి.. అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లోకో పైలట్లు మొబైల్ వినియోగంపై నిషేధం ఉంది. కొందరు స్మార్ట్ వాచ్ (Smart Watch) వాడుతున్నారు. హెల్త్‌కు సంబంధించిన ఇన్పో తెలుసుకునేందుకు వాడుతున్నారు. కొన్ని స్మార్ట్ వాచ్స్ (Smart Watch) మొబైల్‌కు కనెక్ట్ చేయడంతో.. ఫోన్ మాదిరిగా ఉపయోగించవచ్చు అని అధికారి తెలిపారు. దాంతో పోన్ చేసే అవకాశం ఉందని.. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చని తెలిపారు. ట్రైన్ నడిపే సమయంలో స్మార్ట్ వాచ్ (Smart Watch) వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.