»Heres How To Keep Your Phone From Overheating This Summer
Phone : ఎండాకాలం ఫోన్ ఓవర్ హీటింగ్‌తో జాగ్రత్త!
మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతోందా? ఎండాకాలంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి.
Phone Overheating : నిత్య జీవితంలో ఫోన్లు ఒక భాగం అయిపోయాయి. అది లేకుండా ఏ పనులూ కావడం లేదు. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం కొందరు ఎక్కువగా గేమ్‌లు ఆడటం, వీడియోలు చూడటం లాంటివి తరచుగా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని ఫోన్లు తేలిగ్గా ఓవర్ హీట్ అయిపోతుంటాయి. మరి కొందరి ఫోనుల్లో ఛార్జీంగ్ చేస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎండాకాలంలో(summer) ఫోన్ ఓవర్ హీట్ కావడం మరింత ప్రమాదకరం. అలా కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. అలాగే గేముల్లాంటివీ ఆడకూడదు. అలాగే ఛార్జింగ్(charging) అవుతున్నప్పుడు అది ఎక్కువగా వేడిగా అవుతోందని గుర్తిస్తే వెంటనే దానికున్న పౌచ్‌ని తీసి పక్కన పెట్టేయండి. ఫాస్ట్ ఛార్జర్లను ఉపయోగించి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణ ఛార్జర్‌ని ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా ఛార్జింగ్ సున్నా అయిపోయి స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఛార్జ్ చేయకూడదు. అందులో 20 శాతం ఛార్జ్ ఉన్నప్పుడే మళ్లీ ఛార్జ్ చేసుకోవాలి.
చాలా వేడిగా ఉండే ప్రదేశాల్లో, వేడి గదుల్లో, ఎండలో ఫోన్‌ని ఛార్జ్ చేయకూడదు. మరీ ఎండలు ఉన్నప్పుడు ఏసీ గదుల్లో వీటిని ఛార్జ్ చేసుకోవడం ఉత్తమం. అలాగే నాణ్యత లేని ఛార్జర్లను ఉపయోగించి ఛార్జ్ చేసినా ఫోన్‌కి ఓవర్ హీటింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువగా ఫోన్ వాడినప్పుడు ఓవర్ హీట్(overheating) అయితే అలాంటి సందర్భాల్లో దాన్ని మళ్లీ ఛార్జ్‌లో పెట్టకూడదని గుర్తుంచుకోవాలి.