బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్ 2024 టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఓపెన్ విభాగంలో తొలిసారి గోల్డ్ మెడల్ సాధించింది. స్లోవేనియా జట్టుతో జరిగిన ఈ మ్యాచులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. స్వర్ణం సాధించిన భారత జట్టులో ప్రజ్ఞానంద, డీ.గుకేష్, అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ ఉన్నారు. కాగా 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జట్టుకు కాంస్య పతకం దక్కింది.