»Will Ms Dhoni Retire From Ipl In 2023 Deepak Chahar Has An Interesting Take
MS Dhoni ఇక ఐపీఎల్ లో కనిపించడా..? చాహర్ ఏమన్నాడు..?
MS Dhoni : క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కో టీమ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కేవలం ధోనీ కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే... మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.
క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కో టీమ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కేవలం ధోనీ కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే… మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ ఏడాదే చివరి సీజనా? వచ్చే ఏడాది కూడా ఆడనున్నాడా అనే విషయం గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్ జట్టు ఆటగాడు దీపక్ చాహర్ ఈ విషయంలో తన అభిప్రాయం వెల్లడించారు. వచ్చే సీజన్లో కూడా ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపాడు.
మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు , గుజరాత్ టైటాన్స్ జట్టుకు మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం చెన్నైలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ధోనీ ఆటతీరును చూసిన వారు అతడిలో ఇంకా సత్తా ఉందని స్పష్టంగా గ్రహించగలుగుతున్నారు. మరి కొన్నేళ్ల పాటు ధోనీ ఆడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సహచర ఆటగాడు దీపక్ చాహర్ ఓ అడుగు ముందుకేసి వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా ధోనీ నాయకత్వం వహించనున్నాడని తెలిపాడు.
గత ఏడాది ఐపీఎల్ కరోనా నిబంధనల మధ్య జరిగింది. కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. ఈ ఏడాది మాత్రం 12 ప్రాంతాల్లో జరగనుంది. అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతున్నట్లు ధోనీ గతంలో ఓ సారి తెలిపాడు. 2013 నుంచి ఐపీఎల్ ఆట నుంచి తప్పుకుందామని ధోనీ గత ఏడాది భావించాడు. కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకుని రవీంద్ర జడేజాకు సారధ్య బాధ్యతలు అప్పగించాడు. ఆ నిర్ణయం బెడిసి కొట్టింది. సీఎస్కే ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది కూడా ధోనీ సారధ్యంలోనే చెన్నై జట్టు బరిలో దిగనుంది.