నీటిలో చిరుత కన్నా వేగంగా పరుగెత్తగలడు.. చేపలు, తిమింగళాల కన్నా వేగంగా ఈదగల నైపుణ్యం అతడి సొంతం. పోటీలు ఎక్కడైనా అతి వేగంగా నీటిలో దూసుకెళ్లగలడు.. పతకాలు కొల్లగొట్టగలడు. తండ్రి అగ్ర నటుడైనా అతడి పలుకుబడిని ఏనాడు వాడుకోలేదు. కష్టపడ్డాడు.. ఎదిగాడు.. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు.
నీటిలో చిరుత కన్నా వేగంగా పరుగెత్తగలడు.. చేపలు, తిమింగళాల కన్నా వేగంగా ఈదగల నైపుణ్యం అతడి సొంతం. పోటీలు ఎక్కడైనా అతి వేగంగా నీటిలో దూసుకెళ్లగలడు.. పతకాలు కొల్లగొట్టగలడు. తండ్రి అగ్ర నటుడైనా అతడి పలుకుబడిని ఏనాడు వాడుకోలేదు. కష్టపడ్డాడు.. ఎదిగాడు.. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు. అతడే తమిళ నటుడు మాధవన్ (Madhavan) కుమారుడు వేదాంత్ మాధవన్ (Vedaant Madhavan). తాజాగా నిర్వహించిన ఖేల్ ఇండియా (Khelo India) క్రీడోత్సవాల్లో ఏకంగా ఏడు పతకాలు వేదాంత్ తన ఖాతాలో వేసుకున్నాడు. వాటిలో ఐదుకు ఐదు స్వర్ణాలు (Gold Medals) ఉండడం విశేషం. తన కుమారుడు సాధించిన ఘనతను మాధవన్ సోషల్ మీడియా (Social Media)లో పంచుకున్నాడు.
వేదాంత్ మాధవన్ ప్రొఫెషనల్ స్విమ్మర్ (Swimmer). అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. భారత ప్రభుత్వం (India) ఆధ్వర్యంలో ప్రతి యేటా నిర్వహించినట్టే ఈసారి మధ్యప్రదేశ్ లో ఖేలో ఇండియా క్రీడా పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడాకారులు, అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ పోటీలు ఇటీవల ముగిశాయి. ఖేల్ ఇండియా-2023 క్రీడోత్సవాల్లో మహారాష్ట్రకు 161 అత్యధిక పతకాలతో చాంపియన్ గా నిలిచింది. 56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్య పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఉత్సవాల్లో ఈత విభాగంలో వేదాంత్ మాధవన్ పాల్గొన్నాడు. ఈతలో వివిధ విభాగాల్లో పాల్గొని వేదాంత్ ఏకంగా 7 పతకాలు కొల్లగొట్టాడు. వాటిలో 5 స్వర్ణం, 2 రజత పతకాలు ఉన్నాయి. 100 మీటర్లు, 200 మీటర్లు, 1,500 మీటర్ల విభాగంలో వేదాంత్ బంగారు పతకాలు దక్కించుకున్నాడు. 400 మీటర్లు, 800 మీటర్లలో త్రుటిలో స్వర్ణం చేజార్చుకుని వెండికి పరిమితమయ్యాడు. వేదాంత్ కన్నా ఒక స్వర్ణం ఎక్కువ గెలుచ్చుకున్న ఫెర్నాండెజ్ అపేక్ష (6 స్వర్ణం, 1 రజతం) మొదటి స్థానంలో నిలువగా.. వేదాంత్ (5 బంగారం, 2 వెండి) రెండో స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని మాధవన్ ట్విటర్ లో తెలిపాడు. తన కుమారుడిని చూసి గర్విస్తున్నానని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి విజయానికి కృషి చేసిన కోచ్ కు, టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. ఈ సందర్భంగా కుమారుడు పతకాలు అందుకుంటున్న ఫొటోలను జత చేశాడు. విజయం అనంతరం వేదాంత్ మాట్లాడుతూ.. ‘నేను మాధవన్ కుమారుడిగా మాత్రం ఉండిపోవాలని అనుకోలేదు’ అని తెలిపాడు. అంటే తండ్రి పలుకుబడి కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత నిరూపించుకోవాలని వేదాంత్ చెబుతున్నాడు. అన్నట్టుగా వేదాంత్ భారత క్రీడల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటున్నాడు. ఇక ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా వేదాంత్ సిద్ధమవుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల నుంచి నామమాత్రమే
యేటా నిర్వహించే ఖేలో క్రీడోత్సవాల్లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు, అథ్లెట్లు పెద్దగా సత్తా చాటడం లేదు. ఈసారి కూడా నామమాత్రపు పతకాలే రెండు రాష్ట్రాలకు దక్కాయి. క్రీడలకు తెలుగు రాష్ట్రాలు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో క్రీడాకారులు తమను తాము మెరుగుపర్చుకోవడం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్లు సత్తా చాటేందుకు ప్రభుత్వాలు ప్రోత్సహాకాలు అందించాల్సి ఉంది. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తే అన్ని పోటీల్లో సత్తా చాటే అవకాశం ఉంది.