అగ్రత్రయం మాధవన్(Madhavan), సిద్ధార్థ్(Siddharth), నయనతార(Nayanthara) జంటగా నటిస్తున్న చిత్రం 'టెస్ట్(test). ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది క్రికెట్ నేపథ్యంలో ఉండబోతుంది. మాధవన్, సిద్ధార్థ్ 17 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిసి చేయడం విశేషం. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ స్టార్ నటీనటుల కాంబోలో ఓ సరికొత్త చిత్రం టెస్ట్ రాబోతుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్.మాధవన్(Madhavan), సిద్ధార్థ్(Siddharth), నయనతార(Nayanthara)లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా టెస్ట్ మూవీ(test movie) షూటింగ్ ఈరోజు ప్రారంభమైందని నిన్న హీరో సిద్ధార్థ్ ఈ మేరకు తన ఇన్ స్టా ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు మ్యాడీ, నయన్‌లతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన విషయమని పేర్కొంటూ టెస్ట్ చిత్రం ఫస్ట్ లుక్ ఫొటోను పోస్ట్ చేస్తూ ప్రకటించారు.
అయితే మోషన్ పోస్టర్ చూస్తే ఈ చిత్రం క్రికెట్ ఆట చుట్టూ తిరిగే స్పోర్ట్స్ డ్రామా(sports drama)గా ఉంటుందని తెలుస్తోంది. ఆ మోషన్ పోస్టర్లో క్రికెట్ స్టేడియంలో ఎవరో బంతిని కొట్టడం, అరుపులు, ఈలలు చీర్స్ వినవచ్చు. ఈ క్రమంలో ఈ మూవీ కథాంశం ఎంటని ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
డైరెక్టర్ శశి అతను ఆర్కిటెక్ట్ నుంచి విజయవంతమైన సినీ నిర్మాతగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదగడం చాలా సుదీర్ఘమైన స్ఫూర్తిదాయకమైన స్టోరీ అని ఆర్.మాధవన్ అతని గురించి చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో ‘టెస్ట్’లో భాగమైనందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. మరోవైపు సిద్ధార్థ్ మాట్లాడుతూ శశి నాకు అద్భుతమైన నిర్మాతగా, సహ నిర్మాతగా, ప్రియమైన స్నేహితుడిగా తెలుసని అన్నారు. ఆయన్ను దర్శకుడిగా చూడాలని ఉత్సాహంగా ఉందన్నారు. మిస్టర్ శశికాంత్ నిర్మాతగా నాణ్యమైన కథలను గుర్తించడంలో అతనికి మంచి సామర్థ్యం ఉందని నయనతార అన్నారు. ఆయన విలక్షణమైన దృక్పథం, కథాకథనాల నైపుణ్యం ఈ చిత్రాన్ని అఖండ విజయాన్ని సాధిస్తాయనడంలో సందేహం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్రలో నటించేందుకు రాశి ఖన్నా కూడా సంతకం చేసింది. వై నాట్ స్టూడియోస్‌పై చక్రవర్తి రామచంద్రన్, శశికాంత్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేశారు. ఈ ముగ్గురూ కలసి రావడం ఇదే తొలిసారి. ‘టెస్ట్’ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో పాన్-ఇండియా లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.