టీమిండియా రెండో వన్డేలోనూ విజయం సాధించింది. హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్ అదే జోరు కొనసాగించింది. భారత బౌలర్లు కివీస్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ బ్యాటర్లను ఆలౌట్ చేశారు. మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 34.3 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. కివీస్ 108 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లు షమీ, హార్థిక్ పాండ్యా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ లు కివీస్ బ్యాటర్లను గడగడలాడించారు. దీంతో న్యూజిలాండ్ 108 పరుగులు చేసింది.
అనంతరం 109 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 7 ఫోర్లు, 2 సిక్సులతో చెలరేగిపోయాడు. 50 బాల్స్ కు 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. శుభ్ మన్ గిల్ (40) నిలకడగా ఆడి భారత్ స్కోర్ ను పెంచాడు. గిల్ తో కలిసి ఇషాన్ కిషన్ వరుస షాట్లు ఆడారు. భారత్ 20.1 ఓవర్లలో 111 రన్స్ చేసి గెలుపొందింది. టీమిండియా రెండో వన్డేలో కూడా విజయం సాధించడంతో సిరీస్ ను సొంతం చేసుకోనుంది.