»Shock To Sunrisers Team Captain Markram And 2 Players Are Absence
Sunrisers Teamకు షాక్.. ఫస్ట్ మ్యాచ్‌కు దూరంగా కెప్టెన్, మరో ఇద్దరు కూడా
IPL 2023:ఆదిలోనే సన్ రైజర్స్ (SUN RISERS) హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్‌కు సన్ రైజర్స్ కెప్టెన్ సహా మరో ఇద్దరు అందుబాటులో ఉండటం లేదు. ఈ మ్యాచ్‌కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
Shock to Sunrisers Team, Captain Markram and 2 players are Absence
IPL 2023:మరికొన్ని గంటల్లో ఐపీఎల్ (IPL 2023) ప్రారంభం కాబోతుంది. క్రికెట్ లవర్స్‌కు ఇక పండగే.. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ (narendra modi) స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచే ప్రారంభ వేడుక మొదలవనుంది. ఈ రోజు గుజరాత్ టైటాన్స్(GI)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తొలి మ్యాచ్ జరగనుంది. 18వ ఐపీఎల్ సీజన్లో పలు కీలక మార్పులను చేశారు. ఎప్పటిలాగే శని, ఆదివారాల్లో రెండు మ్యాచులు జరగనున్నాయి.
ఆదిలోనే సన్ రైజర్స్ (SUN RISERS) హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. తొలి మ్యాచ్ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో (UPPAL STADIUM) జరగనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో (RR) జరిగే మ్యాచ్‌కు సన్ రైజర్స్ కెప్టెన్ సహా మరో ఇద్దరు అందుబాటులో ఉండటం లేదు. ఈ ముగ్గురు సౌతాప్రికా ప్లేయర్స్ కాగా.. నెదర్లాండ్స్ వన్డే సిరీస్ కోసం వీరు రావడం లేదు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ (Captain) మార్క్ రమ్, పేసర్ మార్కో జాన్సెన్, క్లాసెన్ తమ జట్టుతో ఉన్నారు. శుక్ర, ఆదివారాల్లో రెండు మ్యాచులు ఆడిన తర్వాత సన్ రైజర్స్ టీమ్‌తో జత కలుస్తారు. ఆదివారం సన్ రైజర్స్ తొలి మ్యాచ్‌కు ముగ్గురు ప్లేయర్స్ అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా వెటరన్ సీమర్ భువనేశ్వర్ కుమార్ (bhuvaneshwar kumar) జట్టుకు నాయకత్వం వహిస్తాడు.