భారత్ లో ఐపీఎల్ (IPL) తరహాలో అమ్మాయిల క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ (Wpl) ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న ప్రారంభమైన ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చివరి లీగ్ మ్యాచ్ లోనూ దారుణంగా ఆడింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడింది.
భారత్ లో ఐపీఎల్ (IPL) తరహాలో అమ్మాయిల క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ (Wpl) ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న ప్రారంభమైన ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చివరి లీగ్ మ్యాచ్ లోనూ దారుణంగా ఆడింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడింది. డబ్ల్యూపీఎల్‌లో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై (Royal Challengers Bangalore) ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
డబ్ల్యూపీఎల్ (Wpl) చివరి అంకానికి చేరింది. నేటితో లీగ్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అయితే నేడు(మార్చి 21) జరిగిన మొదటి మ్యాచ్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను ఆర్సీబీ (RCB) ఓటమితో ముగించింది. ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఘోరంగా ఓడింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హర్మన్ ప్రీత్ కౌర్(Harman Preet Kaur) సేన.. 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 129 పరుగులు చేసింది. హెలీ మ్యాథ్యూస్(24), యస్తికా భాటియా(30), చివర్లో వచ్చిన పూజా వస్త్రాకర్(19), అమెలియా కెర్(31) లక్ష్యాన్ని ఛేదించారు. ఆర్సీబీ బౌలర్లలో కనిక అహుజా 2, ఆషా శోభనా, ఎల్లిస్ పెర్రీ, శ్రేయంక పాటిల్, మేఘన షట్ తలో వికెట్ తీశారు. అయితే ముంబయి ఈ లక్ష్యాన్ని మరింత త్వరగా ఛేదించే ఉంటే.. పాయింట్ల పట్టికలో ముంబయి (Mumbai) అగ్రస్థానానికి చేరుకునేది. కానీ అది జరగలేదు. దీంతో రెండో స్థానానికి పరిమితమైంది.
ఫలితంగా దిల్లీ క్యాపిటల్సే(Delhi Capitals) పాయింట్స్ టేబులో నెం.1 స్థానంలో ఉంది. అయితే మరికాసేపట్లో యూపీ వారియర్స్ – దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో యూపీ.. దిల్లీని భారీ తేడాతో ఓడిస్తే మాత్రం.. అప్పుడు ముంబయి నెంబర్ వన్ స్థానానికి చేరే అవకాశముంటుంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఎల్లీస్ పెర్రీ (29; 38 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించగా.. రిచా ఘోష్ (29; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి తక్కువ స్కోరుకే ఔటైంది. స్మృతి మంధాన(Smriti Madhana) (24; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పర్వాలేదనిపించింది. సోఫీ డివైన్ డకౌట్‌గా వెనుదిరిగింది. హెథర్ నైట్ (12), కనికా అహుజా (12) తక్కువ స్కోరుకే ఔట్ అయిపోయారు. శ్రేయంకా పాటిల్ (4), మేఘన్ స్కట్ (2), దిశా కాసాట్ (2) రన్స్ చేశారు. ముంబయి బౌలర్లలో అమేలియా (Amelia)కెర్ మూడు వికెట్లు తీయగా.. నాట్ సీవర్, ఇస్సీ వాంగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సైకా ఇషాక్ ఓ వికెట్ తీసింది.