Virat Kohli: ఐపీఎల్ సీజన్ 17లో విరాట్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2024లో శనివారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై కింగ్ విరాట్ కోహ్లీ చెలరేగి భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ ఒక రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఆర్ఆర్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ పేరు ఉంది. కానీ దాన్ని అధిగమించి రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ 62 పరుగుల వద్ద ఈ ఫీట్‌ను సాధించాడు. రాజస్థాన్‌పై 700 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కోహ్లీ ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడగా. అందులో ఒక సెంచరీ, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 156.94 శాతంగా ఉంది. మొత్తం 731 పరుగులు చేశాడు.
ఆర్ఆర్ పై శిఖర్ ధావన్ 24 మ్యాచుల్లో 679 పరుగులు సాధించాడు. తరువాత స్థానంలో 20 మ్యాచుల్లో 652 పరుగులు చేసి ఏబీ డెవిలియర్స్ మూడో స్థానంలో ఉన్నారు. గత రాత్రి విరాట్ కోహ్లీ తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 316 పరుగులు వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా మరో రికార్డు కూడా నమోదు అయింది. బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మొదటి వికెట్‌కు ఏకంగా 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సాధించారు. ఎక్కువసార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన బెంగళూరు జోడీగా వీరిద్దరూ నిలిచారు. వీరి తరువాత డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ఆరు సార్లు వందకు పైగ పార్ట్నర్ షిప్ వహించారు.