»Death Penalty In India Supreme Court Urges More Humane Methods
Death Penalty in India: మరణశిక్షలో మానవీయ పద్ధతులను కోరిన సుప్రీం కోర్టు
కరడు గట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల పైన కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణ శిక్షను అమలు చేయడానికి మరింత సరైన మార్గాలను అన్వేషించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ప్రస్తుతం మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఖైదీలను భారత దేశంలో ఉరితీయడం ద్వారా డెత్ సెంటెన్స్ ను అమలు చేస్తున్నారు. న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ సందర్భంగా కోర్టు ఈ సూచన చేసింది. అతను మరణానికి బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా విద్యుదాఘాతం వంటి తక్కువ బాధాకర పద్ధతులతో ఉరి తీయాలని ప్రతిపాదించారు. ఖైదీలను ఉరి తీసే విషయంలో దేశం అనుసరిస్తున్న విధానాన్ని డెవలప్ చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి సూచించింది. శిక్షను అతి తక్కువ నొప్పితో అమలు చేయాలని, హింసను నివారించాలని న్యాయవాది కోరారు.